ఎన్పీడీసీఎల్ ఏఈ చందూలాల్
శాయంపేట నేటిధాత్రి:
రైతులు తాము పండించిన పంటలను అడవి పందుల బెడద నుండి కాపాడుకోవడా నికి పంట చుట్టూ కంచెలు ఏర్పాటు చేసి, 11 కెవి విద్యుత్ వైర్ల నుండి విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నారని, ఇది ప్రమాదకరమని కనెక్షన్ ఇవ్వవద్దని ఎన్పీడీసీ ఎల్ ఏఈ చందులాల్ తెలిపారు.మండలంలోని గోవిందాపూర్ గ్రామంలో గురువారం 11 కేవీ విద్యుత్ వైర్లకు పంట రక్షణకు అక్రమ కనెక్షన్ వేసుకున్న వైర్లను గుర్తించి సిబ్బందితో వైర్లను తొలగించారు. ఈ సందర్భంగా ఏఈ మాట్లాడుతూ రైతులు పండించిన మక్కజొన్న పంటలను అడవి పందుల బెడద నుండికాపాడుకోవడానికి పంట చుట్టూ ఇనుప తీగలతో కంచె ఏర్పాటు చేసి 11 కేవీ విద్యుత్ వైర్ల నుండి విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నారని, అడవి పందులు తాకగానే విద్యుత్ ప్రమాదంతో అవి మరణిస్తున్నాయని, వెంటనే విద్యుత్తు సరఫరా నిలిచిపోతుం దని తెలిపారు. అర్ధ రాత్రి సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతు న్నట్లు తెలిపారు. రాత్రి వేళల్లో విద్యుత్ క్రమబద్ధీకరణకు వచ్చే విద్యుత్ సిబ్బంది కూడా ప్రమాదాల బారిన పడే సంఘటనలు ఉన్నాయి ఇలాంటి ఘటనలలో విద్యుత్ ప్రమాదాలు జరిగితే విద్యుత్ శాఖకు ఎలాంటి సంబంధం ఉండదని హెచ్చరించా రు. రైతులందరూ సహకరించి విద్యుత్ మెయిన్ వైర్ల నుండి అక్రమంగా విద్యుత్ కనెక్షన్లు తీసుకోవద్దని, విద్యుత్ శాఖకు సహకరించాలని ఏఈ కోరారు.