అవినీతికి పాల్పడను… కడియం శ్రీహరి

స్టేషన్ ఘనపూర్: (జనగాం) నేటి ధాత్రి

అవినీతికి అక్రమానికి పాల్పడని నీతి నిజాయితీ గల వ్యక్తి కడియం శ్రీహరి అంటేనే ఓటు వేయండి అంటూ గ్రామస్తులను కోరిన కడియం శ్రీహరి.

జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గంలోని రంగరాయ గూడెం, కోమటిగూడెం, అక్కపెళ్లి గూడెం, సముద్రాల ఇప్పగూడెం, గ్రామాల్లోని బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భారత రాష్ట్ర సమితి ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కడియం శ్రీహరి మాట్లాడుతూ. మీ ప్రక్క గ్రామంలోని మీ వాళ్లని అడగండి మీ బంధువులను మీ మిత్రులను అడగండి కడియం శ్రీహరి ఎలాంటివాడు ఏమైనా లంగా పనులు చేస్తాడా దొంగ పనులు చేస్తాడా కడియం శ్రీహరి ఎప్పుడైనా అక్రమాలు చేశాడా కడియం శ్రీహరి ఏమైనా అవినీతి చేస్తాడా ఏమైనా భూకబ్జాలు చేస్తాడా కడియం శ్రీహరి ఏదైనా పని ఇప్పిస్తానని డబ్బులు తీసుకుంటాడా అని ఒకసారి మీకు తెలిసిన వారిని మీ బంధువులను అడగండి నేను ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గ పరిధిలోని నాయకులు ఎవరైనా చివరికి కాంగ్రెస్ వాళ్ళైనా సిపిఎం వాళ్ళైనా ఎవరైనా కడియం శ్రీహరి భూకబ్జాదారుడు కడియం శ్రీహరి అవినీతిపరుడు కడియం శ్రీహరి మాకు పదవిస్తానని పనిఇప్పిస్తానని ఒక లక్ష రూపాయలు తీసుకొన్నాడు అనిచెబితే ఓటు వేయకండి. కడియం శ్రీహరి మంచివాడే నిజాయితీపరుడు నీతిగా నిజాయితీగా పనిచేస్తాడని అంటే మాత్రం మీరు నాకు తప్పకుండా నాకు ఓటేయాలి అని చెప్పి మీ అందరిని కోరుతున్నన్నారు రానున్న ఎలక్షన్లో నాకు ఓటు వేసి గెలిపిస్తే ఈ గ్రామాలను ఈ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. కేసిఆర్ నాయకత్వంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం గ్రామాలు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతాయన్నారు.

ఈ కార్యక్రమంలో ఇప్పగూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు పల్లె రవి, సముద్రాల గ్రామ శాఖ అధ్యక్షుడు రాజు, రంగరాయ గూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు సురేష్, సర్పంచ్ ఎంపిటిసి శైలజ అజయ్ రెడ్డి జక్కుల పరుశరాములు తాటికాయల పద్మావతి అరుణ్ చట్ల యాకయ్య జనగామ జిల్లా రూరల్ రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు బెలిద వెంకన్న, చింతకుంట్ల నరేందర్ రెడ్డి, చాగల్ సర్పంచ్ పోగుల సారంగపాణి బూర్ల శంకర్ నగరబోయిన యాదగిరి తోట వెంకన్న ఉపేందర్ రెడ్డి, ఇమ్మడి హరిప్రసాద్, మాజీ సర్పంచ్ కుమారస్వామి, సత్తిరెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ చందర్ రెడ్డి, ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!