మోసపూరిత పార్టీల మాటలు నమ్మి గోసపడొద్దు

*బి.ఆర్.ఎస్ పార్టీ ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం

*గెలిచిన వెంటనే ఫాజుల్ నగర్-తుర్కాషి నగర్ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తా


వేములవాడ, నేటి దాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎన్నికల సందర్భంగా మోసపూరిత మాటలు చెప్పి, అమలు కానీ హామీలు ఇచ్చే పార్టీలను నమ్మి మోసపోయి, గోసపడొద్దని బి.ఆర్.ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు అన్నారు. నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం వేములవాడ రూరల్ మండలం వట్టెంల, ఫాజుల్ నగర్, తుర్కాషి నగర్, నమిలిగుండు పల్లి గ్రామాల్లో జడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ-రాఘవ రెడ్డి, సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డిలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చల్మెడ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మళ్ళీ చీకటి రోజులు చూడాల్సి వస్తుందని, కాంగ్రెస్ పార్టీ 3గంటలే కరెంట్ ఇస్తామంటుందని, మరి 3గంటలు కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కావాలో….?24గంటలు కరెంట్ ఇచ్చే బి.ఆర్.ఎస్ పార్టీ కావాలో…? ఆలోచించుకోండని సూచించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని, రాబోయే రోజుల్లో గ్రామాలు ఇంకా అభివృద్ధి చెందాలన్నా, ప్రజల బ్రతుకులు మరాలన్నా మళ్ళీ బి.ఆర్.ఎస్ పార్టీకే అధికారం ఇవ్వాలని సూచించారు. వేములవాడ వ్యవసాయ సహకార సంఘంలో ఒక సీజన్ లో ఆనాడు 3వేల క్వింటాల్ ల వరి ధాన్యం పండితే, నేడు 3లక్షల క్వింటాల్లా ధాన్యం పండుతుందని, ఇది తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘనత అని అన్నారు. అభివృద్ధి చేయాలనే ఆశయంతో ముందుకు వస్తున్నానని ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే వేములవాడ రూరల్ మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న సమస్యలను తీరుస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా గెలిచిన వెంటనే ఫాజుల్ నగర్-తుర్కాషి నగర్ రోడ్డుకు మొదటి ప్రాధాన్యతగా రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని, రోడ్డు పూర్తి చేసిన తర్వాతే గ్రామంలో అడుగుపెడతానని హామీ ఇచ్చారు.

*బి.ఆర్.ఎస్ పార్టీలో చేరిన యువకులు

ప్రచారంలో భాగంగా ఫాజుల్ నగర్ కు వెళ్లిన చల్మెడ సమక్షంలో గ్రామానికి చెందిన సుమారు 30మంది యువకులు బి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన యువకులకు జడ్పీ చైర్మన్ అరుణ-రాఘవ రెడ్డి, చల్మెడ లక్ష్మీ నరసింహా రావులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండ మల్లేశం యాదవ్, బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి ,సర్పంచుల ఫోరమ్ మండల అధ్యక్షుడు ఏష తిరుపతి, సెస్ డైరెక్టర్ ఆకుల దేవరాజం, ప్యాక్స్ చైర్మన్ తిరుపతి రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాల్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు గోస్కుల రవి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డం హన్మాండ్లు,రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కటకం మల్లేశంతో పాటు రూరల్ మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *