పట్టాదారులమైన మాకు న్యాయం చేయండి

@నీలారపు రంజిత్ కుమార్

నేటిధాత్రి, వరంగల్ తూర్పు

గీసుగొండ మండలం, గొర్రెకుంట గ్రామ శివారు, కోటిలింగాల గుడి దగ్గర సర్వే నంబరు 132/ఏ. లో గల 5ఎకరాల 10గుంటల భూమి కలదు. అట్టి భూమి పట్టదారులైన నీలారపు రంజిత్ కుమార్ తమకు న్యాయం చేయాలని తన ఆవేదనను వ్యక్తం చేస్తూ, ప్రెస్ నోట్ విడుదల చేశారు. దాని వివరణ ఏమనగా గత కొన్ని రోజుల క్రితం వరంగల్ నగరంలో, నిర్మాణంలో ఉన్న ఇండ్ల కూల్చివేత గొడవలకు కారణం తానే అంటూ, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తు, తనపైన అక్రమ కేసులు నమోదు చేయాలని చూస్తున్న వారిపై, వరంగల్ గిర్మాజిపేటకి చెందిన నీలారపు రంజిత్ కుమార్ ప్రెస్ నోట్ ద్వారా తన ఆవేదనను తెలియజేశారు.

వివరాల్లోకి వెళితే…, గీసుకొండ మండలం, గొర్రెకుంట గ్రామ శివారు, కోటిలింగాల గుడి దగ్గరలో నీలారపు రంజిత్ యొక్క తాత అయినటువంటి నీలారపు నర్సయ్య పేరు మీద, సర్వే నంబర్ 132/ఏ. లో, 5ఎకరాల 10గుంటలు భూమి ఉంది అని, ఈ భూమి మా తాత స్వయం సంపాదన అని, ఇట్టి భూమి మా తాత నుండి మా తండ్రి నీలారపు లక్ష్మీనారాయణకి, మా తండ్రి నుండి నాకు అనగా నీలారపు రంజిత్ కుమార్ కు వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తి అని అన్నారు.

ఇట్టి భూమిలో మేము 1954 నుండి ఇప్పటివరకు ఏకైక పట్టదారులమని తెలియజేస్తూ, ఇట్టి భూమిలో ఒక్క గజము కూడా ఇతరులకు ఎవరికి కూడా అమ్మలేదు అని తెలిపారు.

మా సర్వే నంబర్ 132/ఏ లో ఉన్న 5ఎకరాల 10గుంటల భూమిపై, గత కొన్ని రోజులుగా భూ అక్రమదారులు, వరంగల్ భూమాఫియా గ్యాంగ్ అయినటువంటి కాశెట్టి వీరస్వామి, రామ సంతోష్ కుమార్, జంగం రాజేందర్, బి చంద్రమౌళి తదితరులు కలిసి, అక్రమంగా మా సర్వే నంబర్ లోని భూమి మీదకు వస్తున్నారు. అట్టి భూమిలో అక్రమ కట్టడాలు చేస్తున్నారు. దీనిపైన నేను సంబంధిత భూ కబ్జాదారులపై గతంలోనే (2017లో) పోలీసు కేసు (ఎఫ్.ఐ.ఆర్ నెంబర్ 29/2017) నమోదు అయింది అని, అట్టి క్రిమినల్ కేసు (2198/2017) లలో, కోర్టులో సదరు భూఅక్రమదారులకు శిక్ష పడినది అని తెలియజేస్తూ, సర్వే నంబర్ 132/ఏ లో గల భూమిలోకి, ఇంకొకసారి అడుగుపెట్టము, తప్పు అయినదని ఒప్పుకొని, కోర్టులో పడిన శిక్షకు అపరాధ రుసుము చెల్లించినారు అని నీలారపు రంజిత్ తెలియజేశారు.

భూఅక్రమదారులు కాసెట్టి వీరస్వామి, రామ సంతోష్ కుమార్, వీరు ఇరువురు జాగల మీద పెట్టుబడులు పెడుతూ, పట్టాదారులు ఆయన మా భూమిలోకి అక్రమంగా చొరబడి, అక్రమ నిర్మాణాలు చేయడం సమంజసం కాదు అని తెలియజేస్తున్నాను.

వారి సర్వే నంబరు కాదని తెలిసి కూడా, భూ అక్రమణకు పాల్పడుతూ, మా సర్వే నంబర్లోని భూమిని అక్రమంగా ఆక్రమణకు పాల్పడుతూ, అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తూ, నాపైనే అక్రమ కేసులు బనాయించడానికి ప్రయత్నిస్తున్నారు అని తెలిపారు. స్థానిక పోలీసులు వీరిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని, త్వరలోనే పోలీస్ కమిషనర్ కు పిర్యాదు చేస్తానని ప్రెస్ నోట్ ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశారు నీలారపు రంజిత్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!