డోరే కులస్తులకు న్యాయం చెయ్యండి.
జహీరాబాద్. నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గ ము లోని డోరే కులానికి జరుగుతున్న అన్యాయాల గురించి తెలంగాణ రాష్ట్ర నాయకులు మాజీ హోమ్ శాఖ మంత్రి, ఉమ్మడి ఆంద్రప్రదేశ్ మాజీ గవర్నర్, మాజీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే ను కలసి ఎస్సి బీ నుండి ఎస్సి సి మార్చాబడింది తమ కులానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది అని మా కులానికి యధావిధిగా ఎస్సి బీ కొనసాంగించాలని డోరే కుల పెద్దలు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ము లో మా డోరే కులం కేవలం 2 వేల జనాభా నే కులగణన లో చూపడం జరిగింది .కానీ తెలంగాణలో మొత్తం జనాభా సుమారు ఆరు వేల పైచిలుకు ఉంటుంది.డోరే రాష్టఅధ్యక్షులు దత్తు, మరియు వివిధ జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు. జాహిరాబాద్ తాలూకా నుండి పవనకుమార్ డి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.