
DMHO Dr. Appayya Inspects Kadipikonda Health Center
ఉపకేంద్రం కడిపికొండను అకస్మికంగా సందర్శించిన డిఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య
హన్మకొండ జిల్లా,నేటిధాత్రి (మెడికల్):
జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏ అప్పయ్య గారు ఉపకేంద్రం కడిపికొండను ఆకస్మికంగా సందర్శించడం అయినది, ఉపకేంద్రంలో హాజరు పట్టికను, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నాడు వారికి అందుతున్నటువంటి సేవలు, ఏం ఎన్ సి రిజిస్ట్రేషన్, డ్రైడే కార్యక్రమం, ఫీవర్ సర్వే, టీబి న్యూట్రిషన్ కిట్స్ సప్లై, ఉప కేంద్రంలో అందుబాటులో ఉన్న మందుల వివరాలు తెలుసుకొని అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కడిపికొండ ను సందర్శించడం అయినది కడిపి కొండ లో ల్యాబ్ ,ఫార్మసీ వార్డు ,లేబర్ రూమ్ ,ఆయుష్ క్లినిక్ చూసి ఫీవర్ సర్వే ,ఈడి లిస్టును పరిశీలించడం అయినది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ ఉదయం 9 గంటల నుంచి నాలుగు గంటల వరకు అందరు అందుబాటులో ఉండాలని, జ్వర నిర్ధారణ సర్వే, డ్రై డే కార్యక్రమం పకడ్బందీగా చేయాలని , ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.
వీరితో పాటుగా కడిపికొండ వైద్యాధికారిని డాక్టర్ శ్రీదేవి, హెల్త్ సూపర్వైజర్లు, సీనియర్ అసిస్టెంట్, హెల్త్ అసిస్టెంట్, సిస్టర్స్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.