Divisional Panchayat Office Opened in Zahirabad
జిల్లా కలెక్టర్ చోరువతో ఎట్టకేలకు జహీరాబాద్లో డివిజనల్ పంచాయతీ కార్యాలయం ఏర్పాటు!!!
◆:- కార్యాలయం ప్రారంబానికి ప్రజా ప్రతినిధులను మరిచిన డి ఎల్ పిఓ
జహీరాబాద్ నేటి ధాత్రి:
దశాబ్ది కాలం తర్వాత ఎట్టకేలకు జహీరాబాద్ నియోజకవర్గం లో డివిజనల్ పంచాయతీ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు జరిగిన వెంటనే ప్రజలకు దగ్గరగా పరిపాలన ఉండాలనే దృఢ సంకల్పంతో అప్పటి ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ కన్నా కలలు సహకారం కావడం జరిగింది. కానీ జహీరాబాద్ లో మాత్రం అన్ని డివిజన్ కార్యాలయాలు ఏర్పడ్డప్పటికి డివిజన్ పంచాయతీ కార్యాలయం నేటికీ ఏర్పడకపోవడం, గ్రామాలలో నెలకొన్న సమస్యలు ఎవరికి చెప్పాలో తెలియక జహీరాబాద్ నియోజకవర్గం ప్రజలు జిల్లా పంచాయతీ కార్యాలయానికి వెళ్లేవారు, ఇట్టి విషయాన్ని గ్రహించిన పెన్ గన్ న్యూస్ పలు సందర్భలలో జహీరాబాద్ లో డివిజన్ పంచాయతీ కార్యాలయం ఏర్పాటు చేయాలిని సూచించడం జరిగింది. అంతేకాకా జహీరాబాద్ నియోజకవర్గం
నుండి అంబేద్కర్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి మరియు సంగారెడ్డి జిల్లా సమాచార హక్కు చట్టం ప్రధాన కార్యదర్శి అయిన తుంకుంట మోహన్ జిల్లా కలెక్టర్ కు ప్రజావాణి లో పలుమార్లు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. జహీరాబాద్. నియోజకవర్గం స్థానిక శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు, జిల్లా కలెక్టర్ కు తమలేఖ ద్వారా తెల్పడం జరిగింది, అంతేకాకుండ రాష్ట్ర మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ వై. సరోత్తమ్ ప్రెస్ మిట్ల ద్వారా హెచ్చరిక చేయడం జరిగింది. నియోజకవర్గంలో ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు సైతం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా పంచాయతీ అధికారికి చెప్పడం ద్వారా జహీరాబాద్ నియోజకవర్గంలో డివిజనల్ పంచాయతీ కార్యాలయానికి మోక్షం కలిగిందని నియోజకవర్గం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందరు డివిజనల్ అధికారుల లాగే డివిజనల్ పంచాయతీ అధికారి కూడా ఏళ్ళ వేళలా ప్రజలకు తమ కార్యాలయంలోనే అందుబాటులో ఉండాలని
నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో
పర్యటించి, గ్రామాలలో నెలకొన్న సమస్యలపై దృష్టి వహించి పంచాయతీ కార్యదర్శుల ద్వారా ఎప్పటికప్పుడు పనులను చేపిస్తూ, నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. డివిజనల్ పంచాయతీ కార్యాలయం ప్రారంబానికి ప్రజా ప్రతినిధులకు పిలువకపోవడం పై నియోజకవర్గం ప్రజా ప్రతినిధులు అసహనం వ్యక్తం చేయడం జరిగింది.
