వినాయక నిమజ్జనానికి డిజె సౌండ్ కు అనుమతి లేదు.

ఆర్కేపి ఎస్ఐ జి రాజశేఖర్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథుని నిమజ్జనం రోజు డిజే సౌండ్ కు ఎలాంటి అనుమతులు లేవని రామకృష్ణాపూర్ పట్టణ ఎస్ఐ జి రాజశేఖర్ అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 13 మంది డీజే యజమానులను ఎమ్మార్వో ముందు హాజరు పరిచి డీజే సౌండ్ పెట్టకుండా ఉండేందుకు వారిని బైండోవర్ చేయడం జరిగిందని ఎస్సై తెలిపారు. డీజే సౌండ్ యజమానులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని, నిమజ్జనం రోజు ఎట్టి పరిస్థితుల్లో డీజే సౌండ్ పెట్టకూడదని యజమానులకు తెలియజేయడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఎవరైనా ఉల్లంఘించినట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!