
తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి గోపాలరావుపల్లి గ్రామానికి చెందిన జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు మీరాల భాస్కర్ ఆధ్వర్యంలో జిల్లా కురుమ యాదవ సంఘం ఆధ్వర్యంలో వేములవాడలోని బీసీ బిడ్డ తుల ఉమా ఇంటికి వెళ్లి పరామర్శించి బిఆర్ఎస్ పార్టీలోకి రావాలని జిల్లాసంఘాల నేతలసభ్యుల తరఫున ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి రాష్ట్రంలోఇన్ని సంవత్సరాలు బిజెపిపార్టీ వెంట ఉన్న తుల ఉమకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాననితిప్పుకొని పార్టీ టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి మోసం చేసిందని ఇందులో బండి సంజయ్ పాత్ర ఉందనిఎన్నో సంవత్సరాల రాజకీయం అనుభవం ఉన్న తుల ఉమకు బిజెపి అధిష్టానం మోసం చేసిందని యాదవ కురుమ సంఘం ఆధ్వర్యంలో తీవ్రత స్థాయిలో ధ్వజమెత్తారు ఆడవారికి 33% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన బిజెపి మోడీ ప్రభుత్వం బీసీ బిడ్డలను మోసం చేసిందని అలాగే బీసీ బిడ్డ అని చెప్పుకునే బండి సంజయ్ ని నమ్మవద్దని గొల్ల కురుమలతో పెట్టుకున్న బిజెపి రాష్ట్రంలో తుడచి పెట్టు పోతుందనిఈ సందర్భంగా తెలియజేశారు తర్వాత సానుకూలంగా స్పందించిన తుల ఉమ.నన్ను నమ్ముకున్న క్యాడర్ తో మాట్లాడి తొందర్లోనే నిర్ణయం తీసుకుంటానని ఆమె అన్నారు ఇంటి కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ పెడ్ డైరెక్టర్ బండ నరసయ్య యాదవ్ యాదవ జిల్లా గౌరవ అధ్యక్షులు జగ్గాన్ని మల్లేశం యాదవ్ ప్రధాన కార్యదర్శి అంబటి సంతోష్ జిల్లా నాయకులు ఎలుక వెంకన్న జడల శ్రీనివాస్ తోట్ల రాములు పేట సర్పంచ్ కెoద గంగాధర్ మధు యాదవ్ ఎల్లయ్య యాదవ్ సంతోష్ యాదవ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు