భూపాలపల్లి నేటిధాత్రి
బాలికలు చదువులో రాణించాలని జిల్లా సంక్షేమ అధికారి చిన్నయ్య అన్నారు అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా బేటి బచావో -భేటీ పడావో కార్యక్రమంలో భాగంగా సుభాష్ కాలనీ అంగన్వాడి సెంటర్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం డిడబ్ల్యూ మాట్లాడుతూ ఆడపిల్లలపై ఉండే వివక్షత హింస బాల్యవివాహాల వల్ల జరిగే నష్టాలు గురించి వివరించారు సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర గొప్పదని, మహిళలు నేడు పురుషులకు సమానంగా రాణిస్తున్నారని, ఆడపిల్లలకు చిన్న వయసులోనే వివాహాలు చేసి ఇబ్బందులకు గురి చేయొద్దని ,ఇద్దరు ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు సుకన్య సమృద్ధి యోజన పథకమును ఉపయోగించుకోవాలని 18 సంవత్సరాలలోపు పిల్లలకు ఏమైనా సమస్యలు వస్తే 1098 నెంబర్ ని ఉపయోగించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ అనూష అకౌంటెంట్ సురేష్ సూపర్వైజర్స్ అరుణ, రజిత చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ తిరుపతి కేస్ వర్కర్స్ కళావతి సాయిరాం అంగన్వాడి టీచర్ వసంత మహిళలు తదితరులు పాల్గొన్నారు