
వనపర్తి నేటిదాత్రి;
ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయిన సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి కె రక్షిత మూర్తి, వనపర్తి లో సి వి రామన్ జూనియర్ కళాశాల త్రివేణి జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించారు.ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.జిల్లా వ్యాప్తంగా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉన్నందున పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఎక్కువ మంది గుమిగూడవద్దని సూచించారు.పరీక్షలు జరిగే సమయంలో పోలీస్ అధికారులు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు.అధికారులు ఎవరైనా సరే పూర్తిగా తనిఖీ చేశాకే పరీక్ష కేంద్రం లోపలికి అనుమతించాలని అక్కడ విధులలో ఉన్న సిబ్బందికి సూచించారు