
Maharshi Valmiki
ధర్మ మార్గాన్ని చూపిన వాల్మీకి మహర్షి
జిల్లా ఎస్పీ
వనపర్తి నేటిదాత్రి .

మంగళవారం నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఎస్పీ మాట్లాడుతూ మహర్షి వాల్మీకి రామాయణం మనిషి జీవనానికి మార్గదర్శక గ్రంథమని అన్నారు ఆయన చూపిన సత్యం, ధర్మం, నీతి మార్గాల్లో నడుచుకుంటూ సమాజానికి.నీతి మార్గంలో నడవడమే వాల్మీకి మహర్షి కి మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఏ ఆర్ అదనపు ఎస్పీ, వీరారెడ్డి, డిసిఅర్భి డిఎస్పీ, ఉమామహేశ్వరావు, కార్యాలయం ఏవో, సునందన, స్పెషల్ బ్రాంచ్ సీఐ,నరేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, అప్పలనాయుడు, శ్రీనివాస్ ,జిల్లా పోలీసు కార్యాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.