20 మందికి పైగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించుటలో కృషి చేసిన కానిస్టేబుల్ రాజశేఖర్ ను అభినందించిన జిల్లా ఎస్పీ
వేములవాడ నేటి దాత్రి
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం లోని యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తీసుకున్న అభ్యర్థులలో 21 మందికి తెలంగాణా పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల లో వివిధ కానిస్టేబుల్ విభాగాలలో ఉద్యోగాలు వచ్చాయి. ఈ సందర్బంగా యువ ఫౌండేషన్ ద్వారా ఎంపిక అయిన అభ్యర్థులు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గారిని మర్యాద పూర్వకంగా కలవటం జరిగింది ఎస్పీ నూతనంగా ఎంపిక అయినా అభ్యర్థులను వీరి ఎంపిక కు వేములవాడ డి ఎస్పీ నాగేంద్ర చారీ ని మరియు అభ్యర్థుల కు శిక్షణ ఇచ్చిన వేములవాడ రూరల్ కానిస్టేబుల్ రాజశేఖర్, ఆకుల వేణు లను అభినందిస్తూ, అభ్యర్థుల కు పోలీస్ శాఖ గురించి పలు సూచనలు చేశారు.