
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో.. ప్రధాన రహదారి మీద ఉన్న దారి మైసమ్మ గుడి నిర్మాణం కొరకు గుడి కమిటీకి 50వేల నగదును రజక సంఘం ఆధ్వర్యంలో అందించడం జరిగింది.
ఈ సందర్భంగా రజక సంఘం కమిటీ నాయకులు మాట్లాడుతూ.. ప్రధాన రహదారి మీద ఉన్న గుడి నిర్మాణం కొరకు సంఘం తరఫున నగదును అందించామని ఇంకొక 50 వేల రూపాయలు కూడా అందిస్తామని తెలిపారు.. దీనికి సహకరించిన రజక సంఘం సోదరులందరికీ ధన్యవాదాలు తెలిపారు
ఈ కార్యక్రమంలో రజక సంఘం అర్బన్ అధ్యక్షులు వైనాల శోభన్ బాబు.. గుడి కమిటీ అధ్యక్షులు క్యాతరాజు సతీష్.. గోపరాజు రాజు, వై నాల కుమార్, చలకాని రమేష్, వావిళ్ళ సామి, ఉప్పుల సారయ్య, డాక్టర్ రమేష్, తిరుపతి, తోపాటు రజక సంఘం నాయకులు పాల్గొన్నారు