150 ఏళ్లస్మారకోత్సవాలలొ పాల్గొన్న జిల్లా అధ్యక్షులు నిషిధర్ రెడ్డి.
చిట్యాల, నేటిదాత్రి :
వందేమాతరం జాతీయ గేయం 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న స్మారకోత్సవాల భాగంగా చిట్యాల మండలంలో బిజెపి మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరిగింది,
ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత బెంగాలీ సాహితీవేత్త *శ్రీ బంకింఛంద్ర చటర్జీ రచించిన జాతీయ గీతం “వందేమాతరం”*ను విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి గళమెత్తి గీతాలాపనం చేయడంతో వేదిక మొత్తం దేశభక్తి జయజయధ్వానాలతో మార్మోగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా జిల్లాబిజెపి అధ్యక్షులు ఏడునూతుల నిషిధర్ మాట్లాడుతూ
వందేమాతరం గేయం భారత స్వాతంత్ర్య సమరంలో ప్రజలకు స్ఫూర్తిదాయకంగా మారి, దేశవ్యాప్తంగా ఉద్యమాలకు ప్రేరణనిచ్చిందని తెలిపారు. “వందేమాతరం కేవలం ఒక గీతం కాదు; ఇది భారత మాత పట్ల ప్రేమను, గౌరవాన్ని, ఐక్యతను వ్యక్తం చేసే ఒక మహోన్నత మంత్రం” అని అన్నారు,అనంతరం బిజెపి మండలం అధ్యక్షులు బుర్ర వేంకటేష్ గౌడ్ మాట్లాడతూ
వందేమాతరం గీతం భారతీయులలో జాతిగౌరవాన్ని పెంపొందించే శక్తి అని, ఇది మనందరికీ ఒక స్ఫూర్తి, ఒక శక్తి, ఒక మంత్రము అని చెప్పారు. ఈ గేయం స్వాతంత్ర్య సమరంలో ప్రజల మనసుల్లో ధైర్యం పెంచి, బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడే జోశ్ నింపిందని వివరించారు. ఈ గేయం అన్ని వర్గాల ప్రజల హృదయాలను ఏకం చేసి, దేశ ఐక్యతను బలపరిచిన చరిత్ర ఉందని గుర్తుచేశారు.ఈ తరహా కార్యక్రమాలు విద్యార్థుల్లో దేశభక్తి, సమాజానికి సేవ చేయాలనే భావన, దేశం కోసం మంచి చేయాలనే తపనలను పెంపొందిస్తాయని తెలిపారు. యువతలో జాతీయ భావాన్ని బలపరిచేందుకు వందేమాతరం వంటి స్ఫూర్తిదాయక గేయాలు తరతరాలకు మార్గదర్శకాలు అవుతాయని అన్నారు.
కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు చెక్క నరసయ్య మండల మొగిలి గజనాల రవీందర్ బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పెండ్యాలరాజు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు తీగల జగ్గయ్య జిల్లా కార్యదర్శి సుదగాని శ్రీనివాస్ బిజెపి సీనియర్ నాయకులు గుండ సురేష్ మల్లేష్ టేకుమట్ల మండలాధ్యక్షుడు గుర్రపు నాగరాజు మండల ప్రధాన కార్యదర్శి రావుల రాకేష్ అశోక్ చారి నగవత్ పూర్ణ సారంగ పని అశోక్ చింతల రాజేందర్ కేంసారపు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
