
SOCIAL MEDIA TRACKING CELL
సోషల్ మీడియా పోస్టులపై జిల్లా పోలీసుల ప్రత్యేక నిఘా
శాంతి భద్రతలకు విఘాతం కలిగించేల సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే జైలు శిక్షలు తప్పవు.
జిల్లాలో సోషల్ మీడియా ట్రాకింగ్ సెల్ (SOCIAL MEDIA TRACKING CELL) ఏర్పాటు:జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని సామాజిక మాధ్యమాల్లో మతవిద్వేషాలు రెచ్చగొట్టేల,ఒక వర్గాన్ని,పార్టీని టార్గెట్ గా చేసుకొని పోస్టులు పెట్టె వారిపై,శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెట్టే వారిపై,వాస్తవాలను తెలుసుకోకుండా అసత్య ప్రచారాలు ఫార్వర్డ్ చేసే వారిపై,ఇతరుల మనోభావాలు దెబ్బతీసేలా పోస్టులు పెట్టె వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. సామాజిక మధ్యమల్లో
(ట్విటర్,ఫేస్బుక్,వాట్సాప్,ఇతర సోషల్ మీడియా..)వచ్చే పోస్టులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజ నిజాలు తెలుసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో అట్టి మెసేజ్లను ఫార్వర్డ్ చేయకూడదని,సోషల్ మీడియా పోస్టులపై జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సోషల్ మీడియా ట్రాకింగ్ విభాగం(“SOCIAL MEDIA TRACKING CELL”)ప్రతి పోస్టును నిశితంగా పరిశీలించడం జరుగుతుందని,జిల్లాలో సోషల్ మీడియా విభాగం ద్వారా సోషల్ మీడియా పోస్టులపై 24*7 నిరంతరం పోలీస్ నిఘా ఉంటుందని ఈసందర్భంగా హెచ్చరించారు.
సామాజిక మధ్యమల్లో మతవిద్వేషాలు,ఒక వర్గాన్ని,పార్టీని టార్గెట్ గా,శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులపై,వాస్తవాలను తెలుసుకోకుండా అసత్య ప్రచారాలు ఫార్వర్డ్ చేసే వారి సమాచారం సోషల్ మీడియా ట్రాకింగ్ సెల్ 8712537826 నంబర్ కి మెసేజ్ రూపంలో పంపగలరు.