District Panchayat Officer Inspects Sammakka Jatara Arrangements
గుండి గ్రామాన్ని సందర్శించిన జిల్లా పంచాయతీ అధికారి వనం జగదీశ్వర్
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో బుధవారం నుండి ప్రారంభం కానున్న సమ్మక్క జాతర ఏర్పాట్లను పరిశీలించి రామడుగు మండలంలో ప్రసిద్ధి చెందిన గుండి గ్రామంలోని సమ్మక్క జాతర విశేషాలను గ్రామస్థులను అడిగి తెలుసుకున్న అనంతరం గుడి ప్రాంగణంలో సమ్మక్క గద్దే వద్ద కొబ్బరికాయ కొట్టి పారిశుధ్య పనులను, జంపన్న వాగును పరిశీలించి లైటింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, జాతరకు వచ్చే భక్తుల కోసం తాగునీటి సదుపాయం ఏర్పాటు గురించి అడిగి తెలుసుకుని జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లను పూర్తి చేయాలనీ అధికారులను ఆదేశించారు. అనంతరం ఇటీవలే మరణించిన గ్రామ పంచాయతీ సఫాయి కార్మికులు పోచయ్య కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబంలో ఒకరిని గ్రామ పంచాయతీ ఉద్యోగం వచ్చేలా తగిన చర్యలు తీసుకుంటాం అని వారి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి శ్రావణ్ కుమార్, గ్రామ సర్పంచ్ గుమ్మడి మల్లేశం, పంచాయతి కార్యదర్శి శ్రీనివాస్, వార్డు సభ్యులు, గౌడ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, గ్రామస్థులు, రామస్వామి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
