అంగన్వాడి సెంటర్ ను తనిఖీ చేసిన జిల్లా అధికారి హైమావతి
నిజాంపేట్, నేటి ధాత్రి :
నిజాంపేట మండలం పరిధిలోని చల్మెడ గ్రామంలో మంగళవారం రోజున జిల్లా వెల్ఫేర్ అధికారి హైమావతి చల్మెడ అంగన్వాడి 4 వ సెంటర్ ను సందర్శించడం జరిగింది. బరువు తక్కువ ఉన్న పిల్లలు(SAM), నామ మాత్రం బరువు తక్కువ ఉన్న పిల్లలు(MAM) పిల్లల బరువులు, ఎత్తు, చూడడం జరిగింది. పిల్లల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ లక్ష్మి, అంగన్వాడి టీచర్ లక్ష్మీనరసమ్మ, పిల్లల తల్లులు గర్భిణీలు పాల్గొన్నారు.