District Medical Officer Reviews Muttaram PHC
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ వాణిశ్రీ
ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రo ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వాణిశ్రీ సందర్శించడం జరిగింది దీనిలో భాగంగా వైద్య సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగినది. సిబ్బంది ఇప్పుడు హైపటైటిస్ వైరస్ నుండి ఇబ్బంది కలగకుండా ఉండడానికి హెపటైటిస్ బి వ్యాక్సిన్ మేడం ఇనాగ్రేషన్ చేసి ఇవ్వడం జరిగినది మరియు హాస్పటల్ సిబ్బందికి మరియు సిబ్బందికి రివ్యూ మీటింగ్ తీసుకోవడంతో పాటు పలు సూచనలు చేయడం జరిగినది. రివ్యూ లో భాగంగా ముఖ్యంగా టీవీ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఏఎంసీ రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ డెలివరీ మీద పలు సూచనలు సలహాలు సూచించారు అందరు సక్రమంగా విధులు నిర్వహించాలని తెలిపినారు ఇన్ పేషెంట్స్ ఓపి ఎంత వస్తుంది అని చూడడంతో పాటు ఇన్ పేషెంట్స్ ఆల్ రిజిస్టర్స్ ను వెరిఫికేషన్ చేశారు ఈ కార్యక్రమం లో జిల్లా టీవీ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ సార్ జిల్లా ఇమినేషన్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ కుమార్ మరియు హాస్పటల్ సిబ్బంది పాల్గొన్నారు
