జమ్మికుంట: నేటిధాత్రి
గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థి డీఎస్సీ 2024 ఫలితాలలో గణిత విభాగంలో జిల్లా స్థాయిలో నాలుగో ర్యాంక్ సాధించాడు. ఇల్లందకుంట మండలంలోని చిన్న కోమటి పల్లి గ్రామానికి చెందిన చుక్క రామకృష్ణ ఇటీవల జరిగిన డీఎస్సీ లో గణితం విభాగంలో జిల్లా స్థాయి నాలుగో ర్యాంకు సాధించాడు. ప్రాథమిక విద్యను విద్యారణ్య ఆవాస విద్యాలయంలో చదివి, ఇంటర్ డిగ్రీ ని విస్డం మరియు చాణిక్య డిగ్రీ కళాశాలలో పూర్తి చేశారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన నిరుపేద విద్యార్థి డీఎస్సీలో నాలుగో ర్యాంక్ సాధించడం పట్ల స్థానిక ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
గ్రామీణ విద్యార్థికి డీఎస్సీలో జిల్లా స్థాయి నాలుగో ర్యాంక్
