చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో సమ్మక్క సారక్క హెరిటేజ్ ఏబీవీపీ భూపాలపల్లి జిల్లా సారధ్యంలో నిర్వహిస్తున్న భూపాలపల్లి జిల్లా స్థాయి కబడ్డీ, కోకో, వాలీబాల్ , అథ్లెటిక్స్ పోటీలు ఈనెల 3 నుండి 6 వరకు నిర్వహించిన పోటీలు శనివారంతో ముగిసాయి. ఏబీవీపీ రాష్ట్ర సమితి సభ్యులు వేల్పుల రాజకుమార్
సారథ్యంలో నిర్వహించిన
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహించిన క్రీడలలో జాతీయ సమైక్యతను పెంపొందించే విధంగా నిర్వహించిన పోటీలలో జిల్లాలోని వివిధ పాఠశాలల , జూనియర్ కళాశాలల నుండి 600 వందల మంది విద్యార్థులు కబడ్డీ, కోకో, వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని రాష్ట్ర కార్య సమితి సభ్యులు వేల్పుల రాజ్ కుమార్ తెలిపారు…అనంతరం విజేతల ను ప్రకటించారు…
పాటశాల స్థాయిలో
కబడ్డీ బాలికలు
మొదటి స్థానం.. గురుకులం చిట్యాల..
బాలురు…మహాత్మా జ్యోతిరావు పూలే మొగుళ్ళుపల్లి..కో. కో..
బాలికలు ..
మొదటి.గురుకులం చిట్యాల.
బాలురు.మహాత్మా జ్యోతిరావు పూలే మొగుళ్ళపల్లి.వాలీబాల్…
బాలికలు…గురుకులంచిట్యాల
బాలురు.మహాత్మా జ్యోతిరావు పూలే మొగుళ్లపల్లి,కలశాల స్థాయి..
కబడ్డీ..బాలురు.గాంధీ కాలేజ్ భూపాల పల్లి.
బాలికలు. కేజీబీవీ కొర్కుషల.కో. కో.
బాలురు. ఎంపీజే మొగుళ్ళ పల్లె,బాలికలు. టి ఎస్ ఎం ఎస్ చిట్యాల..వాలీబాల్.
బాలురు. మొగుళ్ళపల్లి
బాలికలు.గురుకులం చిట్యాల.
విజేతలు. జిల్లాస్థాయిలో ఎంపికైన క్రీడాకారులు అందరూ రాష్ట్ర స్థాయిలో పాల్గొంటారు రాజ్ కుమార్ తెలిపారు.