బిజెపి మండల అధ్యక్షుడు భాయ్ లింగారెడ్డి.
ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి
మండల కేంద్రం లో భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం జరిగింది, ఇట్టి కార్యక్రమం లో మండల అధ్యక్షులు బాయి లింగ రెడ్డి మాట్లాడుతూ
కరీంనగర్, మెదక్,నిజామాబాద్,ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి చిన్నమైల్ గారిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి అని కోరడం జరిగింది. మరియు కార్యకర్తలకు దిశ నిర్దేశం చేయడం జరిగింది, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమురయ్య గారిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీ తో గెలిపియగలరని కోరారు, ఈ గెలుపు తో రానున్న స్థానిక సంస్థలలో బీజేపీ పార్టీ విజయం కాయమని నిజామాబాదు ఎంపీ ధర్మపురి అరవింద్ గారి నాయకత్వం లో అన్ని స్థానలను బీజేపీ కైవసం చేసుకుంటుంది అన్నారు
ఇట్టి కార్యక్రమం లో బీజేపీ జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం నాయకురాలు భోగ శ్రావణి, మండల నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాలొగొన్నారు,