బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభకు యువత విద్యార్థి లోకం పెద్ద ఎత్తున తరలాలి
బిఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ ద్యావ మధుసూదన్ రెడ్డి.
గంగాధర నేటిధాత్రి :
బిఆర్ఎస్ పార్టీ 25వ వార్షికోత్సవం సందర్భంగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న రజితోత్సవ సభకు చొప్పదండి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున యువత, విద్యార్థి లోకం తరలివెళ్లాలని బిఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ ద్యావ మధుసూదన్ రెడ్డి, బిఆర్ఎస్ వై నియోజకవర్గ ఇన్‌చార్జ్ బంధారపు అజయ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.
గురువారం గంగాధరలో నిర్వహించిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ, త్వరలో నియోజకవర్గ స్థాయి యువత, విద్యార్థి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పార్టీ 25 సంవత్సరాల పాటు ప్రజల మద్దతుతో ముందుకు సాగుతూ, దేశ చరిత్రలో విశేషమైన స్థానాన్ని సంపాదించిందని పేర్కొన్నారు.
“ఒక్కడితో ప్రారంభమైన బిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, అనేకమంది నాయకులను, కార్యకర్తలను తయారు చేసింది. వందలాది ఎమ్మెల్యేలు, వేలాది సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటీసీలను అందించిన పార్టీ బిఆర్ఎస్. విద్యార్థులు, యువతకు అవకాశాలు కల్పించిన పార్టీ ఇదే,” అని వారు అన్నారు. సమావేశంలో గంగాధర యువత అధ్యక్షులు సుంకె అనిల్, రామడుగు అధ్యక్షులు ఆరెపల్లి ప్రశాంత్, కొడిమ్యాల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, బిఆర్ఎస్ చొప్పదండి పట్టణ అధ్యక్షులు నరేష్ రావణ్, సముద్రాల ఓంకార్, గంగాధర సంపత్, జక్కుల వెంకటేష్, దుబ్బాసి రఘు, యువత, విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు.