Collector Reviews Crop Loss in Nekkonda
జిల్లా కలెక్టర్ నెక్కొండలొ పర్యటన
పంట నష్టం, కూలిపోయిన గృహాల పై సమీక్ష
రైతులకు ధైర్యం చెప్పిన కలెక్టర్
#నెక్కొండ, నేటి ధాత్రి:
వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద శనివారం నెక్కొండ మండలంలో పర్యటించారు. వర్షాల ప్రభావంతో నష్టపోయిన పంటలను, కూలిపోయిన గృహాలను, గోడలను ఆమె స్వయంగా క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
రెడ్లవాడ, పెట్టకాలు బొడు తండా, నాజీ తండా, గ్రామాల్లో పంటలను కలెక్టర్కు చూపించిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవుల శ్రీనివాస్, మార్కెట్ డైరెక్టర్ కొమురయ్య తదితరులు. వెంకటాపురం, తోపనపల్లి గ్రామాల మధ్య తెగిపోయిన కల్వర్టులను పరిశీలించిన కలెక్టర్ మాట్లాడుతూ—ఈ కల్వర్టు గత సంవత్సరం కూడా ప్రమాదానికి గురైందని, ఆ సమయంలో తానూ అదే ప్రాంతాన్ని సందర్శించిన విషయాన్ని గుర్తుచేశారు.
పంట నష్టం సర్వేను వేగంగా పూర్తి చేయాలని, వ్యవసాయ శాఖ అధికారులు రెండు రోజుల్లోగా సర్వే ముగించాలని ఆమె ఆదేశించారు. పంట కోతకు సిద్ధంగా ఉండి వర్షంతో నిటమునిగిన వరి పంటను ప్రభుత్వం బైల్ మిల్లుల ద్వారా కొనుగోలు చేయడానికి అనుమతించిందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ తెలిపారు.
అలాగే గ్రామాల్లో కూలిపోయిన గృహాలు, కూలిపోయిన ఇంటి గోడలపై రెవెన్యూ శాఖ సర్వే నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ఈ పర్యటనలో తహసిల్దార్ వేముల రాజకుమార్, ఎంపీడీవో యసం లావణ్య, ఎంపీడీవో కార్యాలయ సుపరింటెండెంట్ దయాకర్, జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
