
కలెక్టర్ ను పుష్పగుచ్చం తో ఆహ్వానించిన చిన్నారి.
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని అంగన్వాడి సెంటర్ ను శుక్రవారం రోజున భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మికంగ సందర్శించారు, అదే సమయంలో చిన్నారి కట్కూరి చిట్టి పుష్పగుచ్చంతొ కలెక్టర్ రాహుల్ శర్మ కి ఇచ్చి ఆహ్వానం పలికి శుభాకాంక్షలు తెలిపింది, ఈ సన్నివేశం అక్కడ ఉన్న వారిని ఆశ్చర్యం కలిగించింది, వెంటనే కలెక్టర్ ఆ చిట్టి ని అభినందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీలో మెనూ ప్రకారం పిల్లలకు పౌష్టికాహారం అందించాలని అంగన్వాడి టీచర్లను ఆదేశించారు, ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ సంధ్యారాణి, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.