పదవ తరగతి పరీక్ష కేంద్రాలను పరిశీలించినజిల్లా కలెక్టర్…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ మండల కేంద్రంలో పదవతరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.
ఈ సందర్భంగా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మైనార్టీ గురుకుల పాఠశాల పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పరీక్ష జరుగుతున్న సరళని క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్.
విద్యార్థులకు పరీక్ష కేంద్రాల్లో ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి విద్యార్థులందరూ సమయపాలన పాటించాలని సమయానికి పరీక్షా కేంద్రాలకు హాజరుకావాలని విద్యార్థులందరూ 10వ తరగతి పరీక్షలలో .
అధిక శాతం ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు ఉపాధ్యాయులు సంబంధిత అధికారులు పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ వాటిని కచ్చితంగా పాటించాలని. జిల్లా కలెక్టర్ ఆదేశించారు