కొత్తగూడ/గంగారాం :నేటిధాత్రి
మహబూబాబాద్ జిల్లా
ఏజెన్సీ మండలాలైనా కొత్తగూడ, గంగారం మండలాలలోని పిహెచ్సి ఎంపీపీ ఎస్ స్పోర్ట్స్ స్కూల్ తాహసిల్దార్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మండలాలలోని వివిధ రికార్డులను సిబ్బంది నిర్వహిస్తున్న విధులను పరిశీలించారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమయపాలన పాటించి విధులను సక్రమంగా నిర్వహించాలని అన్నారు.ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల వైద్యులు అంకిత భావంతో పనిచేస్తూ మెరుగైన వైద్యం, మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు.తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి, రికార్డులు పరిశీ లించారు. కార్యాలయానికి వచ్చే అర్జీదారులకు మెరుగైన సేవలందించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఇతరత్రా భూసమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు.
ఈ తనిఖీ లో వైద్యాధికారులు, రెవెన్యూ అధికారులు ఉన్నారు.