తంగళ్ళపల్లి మండలంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు….
తంగళ్ళపల్లి:నేటి ధాత్రి
తంగళ్ళపల్లిమండలంలో పలు గ్రామాల్లో ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ముందుగా తంగళ్ళపల్లి గ్రామపంచాయతీని ఆకస్మికంగా తనిఖీ చేసి గ్రామ పంచాయతీలో ఉన్న వివరాలు అడిగి తెలుసుకుని సిబ్బంది సరైన టైంలో వస్తున్నారా గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్నారనిఅధికారులను ఆదేశించారు అలాగే మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ముందుగా ప్రజాపాలన కౌంటర్ ను పరిశీలించి ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం టి సైబర్ సర్వర్ రూమ్ను పరిశీలించి మండలంలో ఇంటి ఇతర పనులపై ఆరా తీశారు మండలంలో భూముల క్రమబద్ధీకరణకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి వాటిలో ఎన్ని అప్రూవ్ అయ్యాయని ఎంపిడిఓ లక్ష్మీనారాయణ ఆరా తీయగా . 2893. దరఖాస్తులు అప్రూవ్ అయ్యాయని
కలెక్టర్అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు అలాగే నేరెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేస్తూ ముందుగా ఓపి రిజిస్ట్రేషన్ పరిశీలించారు ఇతర రూములు తిరుగుతూ ఆసుపత్రికి వచ్చే రోగులపై ఎటువంటి రకాల పరీక్షలు చేస్తూ వారికి మందులు ఇచ్చే గది ల్యాబ్ తనిఖీ చేసి మందులు వ్యాక్సిలపై ఆరా తీశారు ప్రభుత్వ వైద్య సేవ చేసుకునేలా ప్రజలందరికీ ప్రభుత్వాసుపత్రిలో వైద్యం చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని వైద్యులకు సిబ్బందికి సూచించారు ప్రభుత్వ దావఖానాలోనే ప్రసవం అయ్యేలా చూడాలని ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఇక్కడ ఏమైనా ఇబ్బందులు కొరతలు ఉన్నాయని నేరెళ్ల వైద్యశాల అధికారి డాక్టర్ చంద్రిక రెడ్డిని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు తర్వాత నేరెళ్ల టీజి ఆర్ ఎస్ గర్ల్స్ విద్యార్థి హాస్టల్లో సందర్శించి విద్యార్థుల కు అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు జిల్లా కలెక్టర్ మెనూ ప్రకారం రాగిజావయిస్తుండగా పరిశీలించారు తర్వాత ఏ ఆహారాలు విద్యార్థులకు అందిస్తున్నారు అని అడగగా ప్రిన్సిపల్ సమాధానం చెబుతూ మెనూ ప్రకారం బగారా రైస్ ఆలుగడ్డ కూర టమాట ఉడికించిన గుడ్లు, సిద్ధం చేస్తున్నామని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు తర్వాత కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలు పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులు ఉత్తమఫలితాలు సాధించేలా చర్యలు తీసుకొని ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రణాళికల ప్రకారం విద్యార్థులను సిద్ధం చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు