బీసీ బాలురు, బాలికల వసతి గృహాలను పరిశీలించిన
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి నేటిధాత్రి
సుభాష్ కాలనీలో నిర్మాణంలో ఉన్న బీసీ బాలురు, బాలికల వసతి గృహాలను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన వసతి గృహ నిర్మాణ పనుల పురోగతిని పంచాయతి రాజ్ ఈఈని అడిగి తెలుసుకున్నారు.
నిర్మాణంలో ఆలస్యానికి కారణాలు ఏమిటని కలెక్టర్ ప్రశ్నించగా మొత్తం 8 గదుల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. కలెక్టర్ గదులను ప్రత్యక్షంగా పరిశీలించి, పనుల నాణ్యత, వేగంపై పలు సూచనలు చేశారు. నిబంధనలకు అనుగుణంగా, వేగంగా పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో పీఆర్ ఈ ఈ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.