వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి పట్టణంలో మున్సిపల్ కార్యాలయంలో బడ్జెట్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ అసిస్టెంట్ కలెక్టర్ లోకల్ బాడీ స్ ఆశి స్ సంగ్వాన్ వనపర్తి ఎమ్మెల్యే తు డి మేఘారెడ్డి పాల్గొన్నారు 64 లక్షల ప్రజాదానంతో నాణ్యతలేని స్లీపింగ్ మిషన్ కొనుగోలుపై అదేవిధంగా మిషన్ మూలకు పడవేయడంతో. 15 వార్డు మున్సిపల్ కౌ న్సిలర్ బండారు కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు బడ్జెట్ ఫైల్ లో ఒక పేజీ తక్కువ ఇవ్వడం పై వెంటనే ఆ పేజీని సమావేశంలోకి తెప్పించారు స్లీపింగ్ మిషన్ మూలకు పడి వేయడంతో ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ స్లీపింగ్ మిషన్ నాణ్యత లేకపోవడంతో కంపెనీకి నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ మాట్లాడుతూ ట్యాక్సీ రూపంలో దాదాపు 8 కోట్ల రూపాయలు రావాలని అధికారుల నిర్లక్ష్యం వల్ల టాక్సీలు వసూలు కావడం లేదని అదేవిధంగా ఇంజనీర్ కాంట్రాక్టర్లను కౌన్సిలర్లను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వనపర్తి లో సెట్ బ్యాక్ లేకుండా ఇండ్లు నిర్మిస్తున్నారని ఇల్లీగల్ పర్మిషన్లు చాలా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మున్సిపల్ కౌన్సిలర్ బ్రహ్మం మాట్లాడుతూ ఇన్ని రోజులు మీరేం చేశారని ప్రతిరోజు జరుగుతున్న సమస్యలపై నీకు అవగాహన ఉన్నదని జిల్లా కలెక్టర్ గారికి చెప్పవచ్చు కదా అని మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ ను ప్రశ్నించారు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల నా వార్డు లో విద్యుత్ లైన్లు పోయాయని మంచినీటి సమస్య ఉన్నదని రోడ్డుపై ఇసుక ఉన్న ద ని చీర్లసత్యం సభా దృష్టి తెచ్చారు
కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ కౌన్సిలర్లు అధికారులు ప్రజలకు జవాబుతారితనంగా ఉండాలని కోరారు ప్రత్యేకంగా మున్సిపల్ ఆదాయం రావడానికి టాక్స్లు రూపంలో వసూలు చేయడానికి సహకరించాలని కోరారు
బడ్జెట్ సమావేశానికి మున్సిపల్ ఇంజనీర్ హాజరు కాకపోవడం ఫోన్లు కూడా ఎత్తడం లేదని ఎమ్మెల్యే మెగా రెడ్డి కఠిన చర్యలు ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంజనీర్ పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు కౌన్సిల ర్లు లక్ష్మీనారాయణ బ్రహ్మం బండారు కృష్ణ నక్క రాములు పుట్టపాక మహేష్ కో ఆప్షన్ గులాం ఖాదర్ ఖాన్ మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి సానిటరీ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డి మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు