
District Collector Kumar Deepak
రెవెన్యూ సదస్సును సందర్శించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల్ జిల్లా జైపూర్ మండల్ నర్సింగాపూర్, మిట్టపల్లి గ్రామాలలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూభారతి కార్యక్రమాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి కార్యక్రమం ద్వారా గ్రామాలలో రెవెన్యూ అధికారులు ప్రజల భూ సమస్యలను పరిష్కరించడానికి రంగంలోకి దిగినట్లు తెలిపారు.రెవెన్యూ అధికారులు ప్రజల వద్దకి వెళ్లి వారి సమస్యల పరిష్కారం కొరకు దరఖాస్తులు చేపట్టి వారి సమస్యలు పరిష్కారం కొరకు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్,తహసిల్దార్ వనజా రెడ్డి, వివిధ శాఖల సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.