పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే (ఉదయం 9 గంటల 30 నిమిషాలకు, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు) పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేత.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్ సైట్ ద్వారా గ్రూప్-2 హాల్ టికెట్ లను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లకు అనుమతి లేదన్నారు.
పరీక్షార్థులు హాల్ టికెట్ ను ఏ4 సైజ్ పేపర్ లో కలర్ ప్రింట్ తీసుకోవాలని సూచించారు. హాల్ టికెట్ పై అభ్యర్థులు తమ తాజా పాస్ పోర్టు ఫోటోను అతికించాలన్నారు.
డౌన్లోడ్ చేసిన హాల్ టికెట్ పై ఫోటో సరిగా ముద్రించి లేకుంటే, అభ్యర్థి గెజిటెడ్ అధికారి లేదా చివరగా చదువుకున్న విద్యాసంస్థ ప్రిన్సిపల్ అటెస్ట్ తో మూడు పాస్ పోర్టు ఫోటోలతో పాటు వెబ్ సైట్ లో పొందుపరిచిన ధ్రువీకరణ పత్రాన్ని పూర్తిచేసి ఇన్విజిలేటర్ కు అందించాలని తెలిపారు.
పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని, పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే గేట్లు మూసివేస్తామని, పరీక్ష రాసే అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలని, అభరణాలు ధరించరాదని సూచించారు.
పరీక్షార్థులు మెహిందీ, తాత్కాలిక టాటూలను వేసుకోరాదని స్పష్టం చేశారు. పరీక్ష రాసే అభ్యర్థులు హాల్ టికెట్ ను, బ్లూ (లేదా) బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తో పాటు గుర్తింపు పొందిన ప్రభుత్వ ఒరిజినల్ ఐడెంటిటీ కార్డును తప్పనిసరిగా తమ వెంట తీసుకెళ్లాలని సూచించారు.
పరీక్ష సమయ పాలనకు సూచికగా ప్రతీ అర్థగంటకోసారి బెల్ మోగుతుందని తెలిపారు. అదే విధంగా మాల్ ప్రాక్టీస్ కు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అభ్యర్థులు ఎటువంటి ఆందోళనకు గురికావద్దని, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు.