ఉపాధి హామీ పనులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు పరిశీలించిన జిల్లా కలెక్టర్….

ఉపాధి హామీ పనులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు పరిశీలించిన జిల్లా కలెక్టర్….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగ్రవాల్. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో పర్యటించి మండల కేంద్రంలోని ఉపాధి హామీ పనులను ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యం మేరకే ఉపాధి హామీ పనులు చేయించాలని. ఉరచెరువులో జలసoచాయ్-జన్ భగీదారి. కింద ఉపాధి హామీలు కొనసాగుతుండగా. కలెక్టర్ ఉపాధి హామీ పనులు పర్యవేక్షించి ప్రభుత్వ లక్ష్యం మేరకు కూలీలకు ఉపాధి హామీ కింద ఉపాధి హామీ కల్పించాలని ప్రతిరోజు 150 మంది పనికి వచ్చేలా చూడాలని. పనిచేసే చోట నీడ సదుపాయం తాగునీరు ఓవర్ ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండాలని. నిరక్షరాస్య కూలీల ఉల్లాస్ కింద చదువు నేర్చుకోవాలని. రానున్న ఖరీఫ్ సీజన్లో రైతులు సన్న సన్న వడ్లు సాగు చేయాలని. అనంతరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ( పి.ఎసిఎస్). కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించి ఈప్పటిదాకా ధాన్యం ఎంత వచ్చింది ఎంత కొనుగోలు చేశారు ఎంత రైస్ మిల్లులకు తరలించారు కొనుగోలు చేసిన ధాన్యం వెంట వెంటనే రైస్ మిల్లులకు గోదాములకుతరలించాలని ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లకు వాహనాలు సమకూర్చాలని సూచిస్తూ. కొనుగోలు కేంద్రాలలో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని తెలియజేశారు. ఇట్టి పరిశీలన కార్యక్రమంలో. డి ఆర్ డి ఓ. లక్ష్మీనారాయణ. డి సి ఎస్ ఓ. బుచ్చిబాబు. జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం. సహకార అధికారి రామకృష్ణ. ఎంపీడీవో. రమేష్. ఇన్చార్జి తహసిల్దార్ మురళి.తంగళ్ళపల్లి గ్రామ సర్పంచ్ లక్ష్మి రాజం. గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామపంచాయతీ పాలకవర్గం. ఉపాధి హామీ కూలీలు హమాలీలు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version