త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు
జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్
మందమర్రి, నేటిధాత్రి:-
మందమర్రి పట్టణంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను మంగళవారం జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్, అడిషనల్ కలెక్టర్ రాహుల్ తో కలిసి పట్టణంలో పర్యటించి పనులను పరిశీలించారు. అక్టోబర్ 1న పురపాలక, పట్టణ అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మందమర్రిలోని పలు అభివృద్ధి పనులను శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు విచ్చేస్తున్న సందర్భంగా మందమర్రి పాత బస్టాండ్ లోని మిని టాంక్ బండ్, సమీకృత వెజ్‌నాన్ నాన్ వెజ్ మార్కెట్, రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులను పరిశీలించారు. అనంతరం పాలచెట్టు ప్రాంతంలోని మహిళా భవన్, డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాణహిత కాలనీ లోని మినీ ఫంక్షన్ హాల్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, త్వరిత గతిన పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న మహిళా భవన్, మినీ ఫంక్షన్ హాల్ తుది మెరుగులను రెండు రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గాదె రాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.