ములుగు జిల్లా నేటిధాత్రి
ములుగు జిల్లా పరిషత్ పాలకవర్గం జెడ్పీ చైర్మన్ పదవీ కాలం మంగళవారం తో గడువు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.కు, ములుగు జిల్లా పరిషత్ పాలక వర్గానికి ప్రత్యేక అధికారిగా నియమించగా ఆయన బాధ్యతలు చేపట్టారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ సంపత్ రావు డిప్యూటి సి ఈ ఓ ఎఫ్ ఏ సి జి జవహర్ రెడ్డి, ములుగు ఎం పి డి ఓ రామక్రిష్ణ, జిల్లా పరిషత్ అధికారులు దివాకర టి. ఎస్ ను కలిసి పూలమొక్కను అందచేసి శాలువా తో సత్కరించారు