జిల్లా శిశు మరియు మహిళా సంక్షేమ శాఖ సంయుక్తం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండలంలోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ భాగమైన బాబు జగ్జీవన్ రాం వ్యవసాయ కళాశాల సిరిసిల్ల జాతీయ సేవ పథక విభాగం మరియు సిరిసిల్ల జిల్లా సంక్షేమ సంయుక్తంగా ఏడవ పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ప్రాథమిక పాఠశాల విద్యార్థులు బాలింతలు గర్భిణీ స్త్రీలు మరియు గృహనులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మి రాజ్యం మాట్లాడుతూసమతుల్య ఆహారం పిల్లలకు మరియు స్త్రీలకు చాలా అవసరమని పాలు మరియు గ్రుడ్డు సముతుల్య ఆహారంలో భాగమని వివరిస్తూ మన దేశంలో 34 శాతం పిల్లలు పోషక లోపంతో బాధపడుతున్నారని తెలియజేశారు కళాశాల ఎన్ఎస్ఎస్ నిర్వాహకులు సహాయ ఆచార్యులు డాక్టర్ మాధవి మాట్లాడుతూ వివిధ రకాల ఆకుకూరలు కూరగాయలు పండ్లు రోజువారి ఆహారంలో భాగంగా తీసుకోవాలని పిల్లలు మొదటి 1000 రోజులు అనగా తల్లి గర్భం దాల్చినప్పటి నుండి పిల్లలకు రెండు సంవత్సరాలు నిండే వరకు పోషకాహాలతో నిండిన ఆహారం ముఖ్యమని వివరించారు డాక్టర్ సంపత్ కుమార్ సహాయ ఆచార్యులు మరియు కళాశాల దత్త గ్రామం నిర్వాహకులు మాట్లాడుతూ మనం ఆరోగ్యంగా ఉండాలని మనం తీసుకునే ఆహారంతో పాటు మన ఆలోచనలు కూడా చాలా ముఖ్యమని కరోనా తర్వాత మన ఆహారం అలవాటును మార్చుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు నేటి పిల్లల రేపటి దేశ పౌరులని వివరిస్తూ వారు ఆరోగ్యం దేశ భవిష్యత్తు నిర్వహిస్తుందని అంతేకాకుండా స్త్రీలు ముఖ్యంగా బాలింతలు సమతుల్య ఆహారం తీసుకోవాలని వివరించారు ఇట్టి కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ ఉమారాణి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంధ్యారాణి అంగన్వాడి అధికారులు పాఠశాల విద్యార్థులు గృహనులు బాలింతలు గర్భిణీ స్త్రీలు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు