శాయంపేట నేటిధాత్రి
శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంలో స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు ఇంటింటికి పంపిణీ చేయడం జరిగింది.జైశ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున భక్తులు నినాదాలు చేస్తూ గ్రామంలో అయోధ్య రామ మందిరం విశిష్టత తెలియజేశారు.ఐదు వందల ఏళ్ల క్రితం అయోధ్యలో రాముడిని ప్రాణ ప్రతిష్టాపన చేసిన సమయంలో స్వామి వారి పాదాల వద్ద ఈ అక్షింతలనుభద్రపరిచారని,అయోధ్య రాముడి పునర్నిర్మాణం చేపట్టిన తర్వాత ప్రాణ ప్రతిష్టాపన అక్షింతలు రామాలయం గుడికి అందించడం మాకు మా గ్రామానికి భాగ్యం అని అన్నారు.అయోధ్య రామ మందిరం తీర్థ ట్రస్ట్ వారి ఆదేశాల మేరకు శ్రీ రామదాసు భజన మండలి హన్మకొండ జిల్లా అధ్యక్షులు మందాడిరాజు,రామదాసు భజన మండలి శాయంపేట మండల కార్యదర్శితడుక సదానందం ఆధ్వర్యంలోశ్రీ సంజీవా ఆంజనేయా స్వామి ఆలయం పూజారి రాజు పూజా కార్యక్రమం చేసి ఆలయం నుండి శ్రీరామా ఆంజనేయ భజన మండలి పత్తిపాక భక్తులు తెల్లవారుజామున ఉదయం 6 గంటల నుంచి వాడ వాడ లో భక్తి గీతాలు ఆలపిస్తూ అయోధ్య రామ మందిరం ట్రస్టు ద్వారా 500 మంది వేద పండితులచే పూజించిన అక్షింతలను ఊరేగింపుగా గడప గడపకు నగరసంకీర్తన చేస్తూ వితరణ చేయడం జరుగుతుంది. కార్యక్రమంలో భాగంగా భక్తి భావన పెంపొందించేందుకు,లోక కల్యాణం లో భాగంగా, భక్తుల కోరిక మేరకు వాడవాడలో భక్తి గీతాలు ఆలపిస్తు, నగర సంకీర్తన చేయడం జరిగింది. ఇందులో భాగంగా గ్రామంలో ఉన్న రామ భక్తులు, మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతూ స్వామి వారి అక్షింతలు, ఆశీర్వదం తీసుకోవడంజరిగింది. ఈ కార్యక్రమంలో భజన మండలి భక్తులుమాందాడి రాజు, తడక , సదానందం గౌడ్, కునురు రాజు, నాముతాబాజి శ్రీధర్, తడక రవి, కుసుమ రమేష్, గజ్జి మహేందర్, వైద్యుల ప్రభాకర్ రెడ్డి , పింగిళి సాంబరెడ్డి, అంబాల మల్లయ్య, వైద్యుల రాంరెడ్డి రెడ్డి, తుడుం, కుమారస్వామి, నాలికె శంకర్, తదితరులు పాల్గొన్నారు.