Steel Water Bottles Distributed at Beguluru School
ప్రాథమికోన్నత పాఠశాలలో వాటర్ బాటిల్ల పంపిణీ
మహాదేవపూర్ అక్టోబర్ 28 (నేటి ధాత్రి)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం బెగుళూరు ప్రాథమికోన్నత పాఠశాలలో జిల్లాల సమ్మిరెడ్డి ఆర్థిక సహాయంతో ప్రభుత్వ ఉపాధ్యాయులు మడక మధు ఆధ్వర్యంలో స్టీల్ వాటర్ బాటిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు కలిపి 120 స్టీల్ వాటర్ బాటిల్ల పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటు వంటి కాటారం డి.ఎస్.పి సూర్యనారాయణ విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్య ఉండాలని, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకొని దానికోసం నిరంతరం కృషి చేయాలని, ఉత్తమ సమాజాన్ని నిర్మించాలంటే ఉపాధ్యాయులు విద్యార్థులకు వ్యక్తిత్వ నిర్మాణం సేవాభావం, నైతిక విలువలు నేర్పాలని మెరుగైన సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని వివరించారు. మడక మధు మాట్లాడుతూ ప్లాస్టిక్ వలన జరిగే అనర్దాలను వివరిస్తూ పాఠశాలలో వాటర్ బెల్ పెట్టి ప్రతి రోజు కనీసం 4 లీటర్ల నీరు స్టీల్ బాటిల్ లో పట్టుకొని అందరు కూడా తాగి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామ్మూర్తి, అధ్యక్షత వహించగా ఎంఈఓ ప్రకాష్ బాబు, సిఐ వెంకటేశ్వర్లు, ఎస్సై పవన్, జడ్.పి.హెచ్.ఎస్ గర్ల్స్ హెచ్ఎం శ్రీనివాస రెడ్డి మరియు గ్రామ పెద్దలు, పాఠశాల శ్రేయోభిలాషులు కటకం అశోక్, చల్ల ఓదెలు, శివరాజ్, పాఠశాల ఉపాధ్యాయులు శ్రీకాంత్, సాయి కుమార్, ప్రవీణ్, మౌనిక, లక్ష్మి మరియు గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.
