Urea Distributed to Farmers in Nizampet Mandal
— రైతులకు యూరియా పంపిణీ
• యూరియా పై అపోహలు నమ్మొద్దు
• ఎంఏఓ. సోమలింగారెడ్డి
నిజాంపేట: నేటి ధాత్రి
యూరియా విషయంలో రైతులు ఎలాంటి అపోహాలకు లోను కావద్దని తగినంత యూరియా అందుబాటులో ఉందని మండల వ్యవసాయ అధికారి సోమవారం రెడ్డి అన్నారు. నిజాంపేట మండలం నస్కల్ రైతు ఉత్పత్తిదారుల సంఘం (FPO) పరిధిలోని నందగోకుల్ రైతులకు యూరియాను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులకు మూడు కౌంటర్ల ద్వారా ఆధార్, పట్టా పాస్ బుక్ సంబంధిత ధ్రువపత్రలను తీసుకొని 560 బస్తాలను అందివ్వడం జరిగిందన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భాను ప్రసాద్ రెడ్డి, పాతూరి బాల్రెడ్డి, సీఈఓ సురేష్, ఏఈఓ శ్రీలత, ఉపసర్పంచ్ మ్యాదరి కుమార్ తదితరులు ఉన్నారు.
