Free LPG Cylinders Distributed under Ujjwala Yojana
ఉజ్వల యోజన గ్యాస్ సిలిండర్ ల పంపిణీ
నిజాంపేట, నేటి ధాత్రి
ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద నిరుపేద కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ కేంద్ర ప్రభుత్వం అందజేస్తుందని సర్పంచ్ చిన్మనమైన శైలజ శ్రీనివాస్ అన్నారు. నిజాంపేట మండలం బచ్చు రాజు పల్లి గ్రామంలో 12 మంది లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల గ్యాస్ స్కీమును సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజశేఖర్, వార్డు సభ్యులు ఉన్నారు.
