‘రైతులకు ట్రాన్స్ ఫార్మర్ల పంపిణీ’
దేవరకద్ర /నేటి ధాత్రి :
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండలంలోని జానంపేట గ్రామంలో ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి మంగళవారం అడ్డాకుల, మూసాపేట, భూత్పూర్ మండలాలకు చెందిన 67 మంది రైతులకు నూతన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు అధికారంలో ఉండి లో వోల్టేజీ సమస్యను తీర్చలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు నూతన విద్యుత్ ట్రాన్స్ ఫార్మార్లను అందజేస్తున్నమన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో ఏ ఒక్క రైతుకు లో వోల్టేజీ సమస్యతో బాధపడకుండా.. పరిష్కరిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.