కొల్చారం( మెదక్) నేటి ధాత్రి:-
మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన దొబ్బల బాలమణి – కిష్టయ్య కూతురు కరుణ వివాహానికి గ్రామప్రజల ఆశీర్వాదంతో శుక్రవారం చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో వధువుకు పుస్తె మట్టెలు అందజేసిన స్థానిక సర్పంచ్ బుడ్డస్వర్ణలత-భాగ్యరాజ్. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పేదరికం నుండి నేను నేర్చుకున్న ప్రతిపాఠం నాలో మానవత్వాన్ని పెంపొందిస్తుంది. మనం ఎంత సంపాదిస్తే ఏముంది మన అనుకున్నవాళ్ళకి సాయం చేయలేనప్పుడు ఆ సంపాదన వ్యర్థం. మన మంచితనమే మనల్ని రక్షిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.