Sports Kits Distributed to Cricket Players
క్రీడాకారులకు టి-షర్ట్ లను పంపిణి
భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోలుసాని లక్ష్మీ నరసింహారావు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో సంక్రాంతి సందర్బంగా ములుగు జిల్లా కొత్తూరు లో జరిగే క్రికెట్ టోర్నమెంట్ కోసం గణపురం క్రికెట్ క్రీడాకారులకు టి-షర్ట్ లను పంపిణి చేసిన భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోలుసాని లక్ష్మీ నరసింహ రావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూక్రీడలు శారీరక, దృఢత్వమే కాకుండా మానసిక ఉల్లాసానిస్తాయన్నారు
క్రీడా కార్యక్రమాలు యువతను చెడు అలవాట్ల నుండి దూరంగా ఉంచి, శారీరకంగా మానసికంగా బలంగా తీర్చిదిద్దుతాయి.
క్రీడలు గెలుపోటములు తట్టుకునే మానసిక ధైర్యాన్ని ఇస్తాయాన్నారు
క్రీడలు కేవలం వినోదం మాత్రమే కాదు,క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, జట్టు భావన వంటి విలువలను పెంపొందిస్తాయి.
అలాగే యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంలో ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్లు కీలక పాత్ర పోషిస్తాయి అన్నారు
భవిష్యత్తులో కూడా
ఇలాంటి క్రీడా కార్యక్రమాలకు తన పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.అలాగే ఎమ్మెల్యే ని పలు మార్లు క్రీడా మైదానం క్రీడాకారులను గురించి కలవడం జరిగింది ఈ సందర్బంగా గణపురం లో ఒక క్రీడా మైదాన్నన్ని ఏర్పాటు చేయాలనీ క్రీడకారుల తరపున కోరడం జరిగింది ఈ సందర్బంగా క్రీడాకారులు లక్ష్మీ నరసింహారావు ని శాలువాతో సన్మానించడం జరిగింది
ఈ కార్యక్రమంలో గణపురం బి ఆర్ ఎస్ టౌన్ అధ్యక్షులు హఫీజ్, క్రీడాకారులు నిమ్మ సురేందర్, తాళ్లపెల్లి సాయి వర్ధన్, వాజిత్, ఇమ్రాన్,పూజారి రాకేష్, ముజ్జు,తాళ్లపెల్లి హర్ష,రమేష్, వహీద్, రోహన్, సాజిత్,మండ రాజు, అభి,షఫీ, వెంకటేష్, కృష్ణ, సోన్ను,బన్నీ, సర్వర్ పాషా తదితరులు పాల్గొన్నారు
