Saree Distribution to Women in Mahadevpur
మండల కేంద్రంలో ఆడపడుచులకు చీరల పంపిణీ
మహాదేవపూర్ నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో గ్రామైక్య సంఘాల ఆధ్వర్యంలో ఆడపడుచులకు సోమవారం రోజున చీరల పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి మంది మహిళలకు కోటి చీరాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ” మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి” కార్యక్రమం కింద ఆడపడుచులకు చీరల పంపిణీలో భాగంగా మండల కేంద్రంలోని ఇంద్ర క్రాంతి పథం కార్యాలయంలో మండల సమైక్య ఆధ్వర్యంలో మహిళా సంఘాల గ్రూపుల మహిళలకు చీరాల పంపిణీనీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంధాలయ శాఖ చైర్మన్ కోట రాజబాబు, పిఎసిఎస్ చైర్మన్ తిరుపతయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అక్బర్ ఖాన్, ఐకెపి ఎపిఎం రాజన్న, మాజీ ఎంపిటిసి సుధాకర్, మాజీ ఎంపీపీ రాణి బాయ్, కమ్యూనిటీ కోఆర్డినేటర్ బంధం స్వామి మరియు పలువురు అధికారులు, గ్రూప్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.
