కోటగుళ్ళు దేవాలయానికి బియ్యం వితరణ

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లు దేవాలయానికి గణపురం మండల కేంద్రానికి చెందిన రౌతు సంజీవని, నాగరాజు దంపతులు బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు ఆలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారికి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలు అందజేశారు ఆలయానికి బియ్యం అందజేసిన సంజీవని నాగరాజు దంపతులకు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!