కొనరావుపేట,నేటిధాత్ర:
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో పాఠశాలలో చదువుతున్న 150 మంది చిన్నారులకు స్వచ్ఛమైన నీటిని అందించాలనే. సద్దు ద్దేశంతోపాఠశాలలో చదువుతున్న చిన్నారులు నల్ల రేశ్వన్ మరియు లక్ష్మి ప్రజ్ఞ ల తాతయ్య నల్ల రాజేశం, తండ్రి కమలాకర్ లు 25,000 రూపాయల విలువ గల వాటర్ ప్లాంట్ ను పాఠశాలకు విరాళంగా ఇవ్వడం జరిగింది.ఈ విషయంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్తు రవీందర్ వారిని అభినందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎస్ ఎం సి చైర్మన్, మామిడిపల్లి శ్రీనివాస్, వైస్ చైర్మన్ పాలకుర్తి లత, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పరమేశ్వరి, కిరణ్, ప్రవీణ, శిరీష, అనూష లు అలాగే పాఠశాల ఎస్ ఎం సి సభ్యులు వసుంధర, నవ్యశ్రీ, సునిత, వసుమతి, దేవరాజు, తదితరులు పాల్గొని, దాతల గొప్పతనాన్ని హర్షించారు.