
గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ కు భూపాలపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రి నర్సింగ్ సూపరిండెంట్ లు
శ్రీనివాస్-జయలక్ష్మిరవీందర్-స్వర్ణలత, జెస్సి బ్యూల-
విజయనంద్,
వ్యాoసాని రాజు రూపశ్రీ దంపతులు రూ. 5 వేలతో పూజా సామాగ్రిని శుక్రవారం అందజేశారు. మొదట వారు స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ అర్చకులు నరేష్ వారికి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయానికి పూజా సామాగ్రి అందజేసిన దంపతులకు కోటగుళ్ళు పరిరక్షణ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.