ఇంటర్ విద్యార్థులకు పెన్నులు పంపిణీ
మంచిర్యాల,నేటి ధాత్రి:
ఇంటర్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు బుధవారం పెన్నులు పంపిణీ చేశారు.మనమంతా శ్రీనివాసులు గ్రూప్ సభ్యులు కలిసి మంచిర్యాల జిల్లాలోని తెలంగాణ మోడల్ పాఠశాల, ప్రభుత్వ కళాశాల,కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయ పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు సుమారుగా 150 కు పైగా పెన్నులను అందించారు.చిలుకూరి శివాలయం ప్రధాన అర్చకులు సురేష్ ఆత్మరామ్ బాపూజీ బాసర సరస్వతి అమ్మవారి పుణ్యక్షేత్రంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన పెన్నులను పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు అందజేశారు.ఈ మేరకు వారు మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో విద్యార్థులందరూ పరీక్షలు రాసి విజయం సాధించాలని తెలిపారు.సురేష్ ఆత్మారాం బాపూజీ ప్రత్యేక పూజలు నిర్వహించి అందించిన పెన్నులను విద్యార్థులకు స్వయంగా తను అందజేయడం గొప్ప విషయమని అన్నారు.10 సంవత్సరాల నుండి సేవ చేయడం జరుగుతుందని విద్యార్థులకు సుమారుగా మూడు లక్షల పెన్నులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగిందని రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు ప్రాణాలికను సిద్ధం చేశామన్నారు.ఈ కార్యక్రమంలో మనమంతా మంచిర్యాల జిల్లా శ్రీనివాసులమ్ వ్యవస్థాపకుడు గండ్ర శ్రీనివాసరావు,మరియు బోయినపల్లి శ్రీనివాసరావు బొద్దుల శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.