
Vasavi Club
వాసవి క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు బుక్స్ పంపిణీ
నల్లబెల్లి, నేటి ధాత్రి:
మండలంలోని పంతులుపల్లి ప్రాధమిక పాఠశాల విద్యార్థులకు, వాసవి క్లబ్ వరంగల్ సెంట్రల్ వారి సౌజన్యంతో ఉచితంగా నోటు బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కర్ణకంటి రాంమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల ఏఏపిసి చైర్మన్ ఎరుకుల వెంకటలక్ష్మి, మాజీ సర్పంచ్ గోనె శ్రీదేవి, మాజీ ఎంపిటిసి ఏడాకుల రవిందర్, మామిండ్లవీరయ్యపల్లి మాజీ సర్పంచ్ ఆసం చంద్రమౌళి అతిధులుగా హాజరై విద్యార్థులకు నోటు బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలోని తమ పాఠశాల విద్యార్థులకు నోటు బుక్స్ పంపించిన వాసవి క్లబ్ వరంగల్ సెంట్రల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో పాఠశాల సహోపాధ్యాయులు కూనమల్ల రాజన్ బాబు ,విద్యార్థులు పాల్గొన్నారు.