
ప్రభుత్వ పాఠశాలలో జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ కోడూరు రవీందర్ రావు జన్మదిన వేడుకల సందర్భంగా నోట్ బుక్స్ పంపిణీ.,
వీణవంక, ( కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి
వీణవంక మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు గారి జన్మదిన వేడుకల సందర్భంగా వీణవంక సహకార కేంద్ర బ్యాంక్ మేనేజర్ బెజ్జంకి అభిలాష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్నులు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ, విద్యార్థి విద్యార్థులకు భవిష్యత్ భావి తరాలకు ఉన్నంత చదువుల కోసం వెళ్లేందుకు సహకార బ్యాంకు నందు ప్రతి విద్యార్థి అకౌంటు ఖాతా తీసుకొని మీకు స్కాలర్షిప్ వీలైనంత డబ్బులను డిపాజిట్ చేసుకొని పై చదువులకు ఉపయోగపడతాయని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు సురేష్ బాబు, లింగయ్య సహకార బ్యాంక్ సిబ్బంది సల్పాల లక్ష్మణ్, ప్రదీప్ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.